ట్రంప్ సంచలన నిర్ణయం.. ఏకంగా విద్యాశాఖను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్ (Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విద్యాశాఖను (US Department of Education) మూసివేస్తూ.. ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని (Financial burden) తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. విద్యాశాఖను మూసివేత (Closure of the Department of Education) పై ట్రంప్ బాంబు పేల్చారు. అంతకు ముందు విద్యాశాఖలోని ఉద్యోగాలపై కొతలు ఉదించిన ట్రంప్ ప్రభుత్వం (Trump's government) తాజాగా ఆ శాఖనే ఎత్తివేస్తూ.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల చేసింది. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య విద్యలో సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా పేద విద్యార్థులు, వైకల్యం ఉన్నవారు మరియు మైనారిటీలకు ఈ నిర్ణయం అన్యాయం చేస్తుందని ఆందోళన నెలకొంది.
విద్యా శాఖను మూసివేయడం వెనుక పలు కారణాలు
అమెరికాలో విద్యా శాఖను మూసివేయడానికి ప్రయత్నించడం వెనుక పలు కారణాలు ఉన్నట్టు అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు (Trump supporters), విమర్శకులు చెబుతున్నారు. అందులో మొదటి స్థానంలో ఆర్థిక భారం ఉంది. అలాగే విద్యాశాఖ ఫెడరల్ ప్రభుత్వం లో అనవసరమైన ఖర్చు, అధిక నియంత్రణకు ప్రతీకగా ఉంది. ట్రంప్ పరిపాలన విద్య వంటి విషయాలు రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల చేతుల్లో ఉండాలని, ఫెడరల్ ప్రభుత్వం తక్కువ పాత్ర పోషించాలని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. ఈ నిర్ణయంతో.. విద్యాశాఖ బాధ్యతలను ఇతర శాఖలైన న్యాయ శాఖ, ఖజానా శాఖ, ఆరోగ్య, మానవ సేవల శాఖలకు బదిలీ చేయవచ్చని తెలుస్తోంది. అయితే ట్రంప్ విద్యా శాఖను మూసివేయాలని కోరుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఖర్చును తగ్గించడం, ఫెడరల్ జోక్యాన్ని తగ్గించడం, విద్య నిర్వహణను స్థానిక స్థాయికి బదిలీ చేయాలనే ఆయన విధాన దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది.
Read More..