నిన్ను చూసి నేను ఇంతకంటే గర్వపడను దేవాన్ష్: నారా బ్రాహ్మణి

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు అయిన నారా దేవాన్ష్ 10 పుట్టినరోజు.

Update: 2025-03-21 03:35 GMT
నిన్ను చూసి నేను ఇంతకంటే గర్వపడను దేవాన్ష్: నారా బ్రాహ్మణి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (Chief Minister Chandrababu Naidu) మనవడు అయిన నారా దేవాన్ష్ (Nara Devansh) 10 పుట్టినరోజు. మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తిరుమల తిరుపతి దేవాస్థానం (Tirumala Tirupati Devasthanam)లోని అన్నదాన సత్రంలో సీఎం చంద్రబాబు నాయుడు తన చేతులతో అన్నదానం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే తన కుమారుని 10వ పుట్టినరోజు వేళ తల్లి నారా బ్రాహ్మిణి (Nara Brahmin).. ఆసక్తికర ట్వీట్ (Interesting tweet) చేశారు. ఆమె తన ట్వీట్‌లో "దేవాన్ష్ 10వ పుట్టినరోజు శుభాకాంక్షలు" నువ్వు చాలా తెలివైన, దయగల, అద్భుతమైన అబ్బాయిగా ఎదుగుతున్నావు. నిన్ను చూసి నేను ఇంతకంటే గర్వపడను. నువ్వు చిన్నవాడిగా అనిపించవచ్చు. కానీ నా జీవితంలో, నువ్వు చాలా అందమైన పాత్రలు పోషిస్తున్నావు. నువ్వు నా చిన్న ఆనందపు మూటవి, నా ప్రాణ స్నేహితుడు, నా అతిపెద్ద చీర్ లీడర్, కొన్నిసార్లు నా గురువు కూడా! నీ నవ్వు మా ఇంటిని ఆనందంతో నింపుతుంది. నీ దయ నా హృదయాన్ని గర్వపరుస్తుంది. నీ ప్రేమ ప్రతిరోజూ నాకు బలాన్ని ఇస్తుంది. అంటూ కుమారునిపై ఉన్న ప్రేమను నారా బ్రాహ్మిణి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Full View

Tags:    

Similar News