ట్రెండింగ్ లో రౌడీ బాయ్ బర్త్ డే గిఫ్ట్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రోల్ రైడా ఓ సాంగ్ రిలీజ్ చేశాడు. స్టైల్ ఐకాన్ రౌడీ బాయ్ పొగరు, తెగువ, మంచితనం, జాలిగుణం గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. తన యాటిట్యూడ్ నే లిరిక్ గా తీసుకున్న రోల్ రైడా .. సూపర్ డూపర్ ర్యాప్ సాంగ్ ఐ యామ్ ది రౌడీ బాయ్…R.O.W.D.Y.. రిలీజ్ చేశాడు. రౌడితో పెట్టుకోకు వెళ్లిపో.. వీలైతే ఓడిపోయి లొంగిపో.. ఫైటర్ గా వస్తున్నాడు పారిపో.. అడ్డేవాడైన వస్తే […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా రోల్ రైడా ఓ సాంగ్ రిలీజ్ చేశాడు. స్టైల్ ఐకాన్ రౌడీ బాయ్ పొగరు, తెగువ, మంచితనం, జాలిగుణం గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. తన యాటిట్యూడ్ నే లిరిక్ గా తీసుకున్న రోల్ రైడా .. సూపర్ డూపర్ ర్యాప్ సాంగ్ ఐ యామ్ ది రౌడీ బాయ్…R.O.W.D.Y.. రిలీజ్ చేశాడు.
రౌడితో పెట్టుకోకు వెళ్లిపో.. వీలైతే ఓడిపోయి లొంగిపో.. ఫైటర్ గా వస్తున్నాడు పారిపో.. అడ్డేవాడైన వస్తే పాతేస్తాడు.. యాటిట్యూడ్ కి కింగ్ అయితాడు విజయ్ దేవరకొండ రా.. తెలుగులో తోపు ఉన్నోడు.. బాలీవుడ్ లకు వెళ్తున్నాడు.. బ్లాక్ బస్టర్ కొట్టేసాడు.. తెలుగు జెండా పాతేస్తాడు.. అంటూ సాగే సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుండగా.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నడిపిస్తున్న ఫ్యాన్స్.. విజయ్ కు బెస్ట్ విషెస్ చెప్తున్నారు. అటు సినీ ప్రముఖులు కూడావిజయ్ కి పుట్టినరోజు శుభాకంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు.
కాగా ఈ పాట ద్వారా వచ్చిన పూర్తి డబ్బును ది దేవరకొండ ఫౌండేషన్ కు అందించనున్నారు మేకర్స్. తద్వారా కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోనున్నారు. అజయ్ మైసూర్ ప్రొడక్షన్ నిర్మాణంలో వచ్చిన ఈ పాటను రోల్ రైడా పాడి, రచించగా.. సందీప్ రాజ్ డైరెక్ట్ చేశారు. రాజ్ రాయ్స్ సంగీతం అందించారు.