CM Revanth Reddy : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం : ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి

సినీ పరిశ్రమ అభివృద్ధి(Film Industry)కి..సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం(Government's Support) ఉంటుందని ఈ మేరకు సినీ పరిశ్రమ ప్రముఖుల(Movie Celebrities) భేటీ(Meeting)లో భరోసానిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Update: 2024-12-26 07:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : సినీ పరిశ్రమ అభివృద్ధి(Film Industry)కి..సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం(Government's Support) ఉంటుందని ఈ మేరకు సినీ పరిశ్రమ ప్రముఖుల(Movie Celebrities) భేటీ(Meeting)లో భరోసానిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ కావడం జరిగిందని ట్వీట్ లో పేర్కొన్న రేవంత్ రెడ్డి భేటీ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు.

ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భేటీలో ప్రభుత్వం వైపు నుంచి, సినీ పరిశ్రమ నుంచి పలు ప్రతిపాదనలపై కీలక చర్చలు, నిర్ణయాలు తీసుకోగా, ఈ సమావేశం పరిశ్రమ ప్రగతికి దోహదం చేస్తుందని సినీ పెద్దలు భావిస్తున్నారు.

Tags:    

Similar News