తెలంగాణలో ముగిసిన ఉపరాష్ట్రపతి పర్యటన... ఢిల్లీకి పయనం

తెలంగాణ‌లో ఉప రాష్ట్రపతి జ‌గ‌దీప్ ధ‌న్కర్ పర్యటన ముగిసింది...

Update: 2024-12-26 16:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ‌లో ఉప రాష్ట్రపతి జ‌గ‌దీప్ ధ‌న్కర్ పర్యటన గురువారంతో ముగిసింది. ఉప రాష్ట్రపతి జ‌గ‌దీప్ ధ‌న్కర్, ఉపరాష్ట్రపతి సతీమణి సుదేష్ ధన్కర్‌ల‌కు శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర గ‌వ‌ర్నర్​ జిష్ణుదేవ్ వ‌ర్మ, రాష్ట్ర ప‌ర్యాట‌క‌ సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ప్రోటోకాల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకట్రావు, రాష్ట్ర డిజిపి జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి , అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితరులు ఉప రాష్ట్రపతికి వీడ్కోలు ప‌లికారు. కాగా బుధ‌వారం హైదరాబాద్‌కు చేరుకున్న ఉప రాష్ట్రపతి దంపతులు తమ రెండు రోజుల పర్యటనను ముగించుకొని తిరిగి ఢిల్లీకి ప్రయాణమయ్యారు.


Similar News