యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మిట్టపల్లి వెంకటేష్
యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మిట్టపల్లి వెంకటేష్ నియమితులయ్యారు..
దిశ, తెలంగాణ బ్యూరో: యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మిట్టపల్లి వెంకటేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిబ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కోసం పూర్తి స్థాయిలో పని చేయాలని సూచించారు. ఇక ఇప్పటికే ప్రెసిడెంట్ గా ఎన్నికైన జక్కిడి శివ చరణ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటేష్ లు త్వరలోనే బాధ్యతలు తీసుకోనున్నారు.