ఏబీవీపీ రాష్ట్ర నూతన కార్యవర్గం.. స్టేట్ ప్రెసిడెంట్‌గా జానారెడ్డి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని సంఘం రాష్ట్ర మహాసభలో నియమించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని సంఘం రాష్ట్ర మహాసభలో నియమించారు. ఈ మేరకు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ ఎన్ జానారెడ్డి నియామకమయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా రాంబాబు నియామకమైన ట్లు జానారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డి, శ్యామ్, వినోద్, జాయింట్ సెక్రటరీలుగా రాకేష్, కల్యాణి, శ్రీరామ్, నరేష్ తేజ, రాజు, చత్రపతి చౌహాన్ ను నియమించినట్లు తెలిపారు. కాగా తమ పై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత అందించిన ఏబీవీపీ అఖిల భారత స్థాయి పెద్దలకు, తెలంగాణ ప్రాంత పెద్దలకు జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థి పరిషత్ అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని తెలియజేశారు.