KTR : భూ భారతి!.. రైతు నెత్తిన సర్వే పిడుగు! : కేటీఆర్

భూ భా(హా)రతి(Bhu Bharati!) రైతు( Farmers) నెత్తిన సర్వే(Survey) పిడుగు(thunderbolt) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శించారు.

Update: 2024-12-27 05:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : భూ భా(హా)రతి(Bhu Bharati!) రైతు( Farmers) నెత్తిన సర్వే(Survey) పిడుగు(thunderbolt) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శించారు. భూమి అమ్మాలన్నా, కొనాలన్నా డిజిటల్‌ సర్వే తప్పనిసరిగా మారిందని, సర్వేయర్‌ కొలిచి మ్యాప్‌ ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేస్తారని, ఆ బాధ్యతంతా రైతుదేనని కొత్త చట్టంలో నిబంధన పెట్టడంతో పెను సమస్యగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. మండలాల్లో సగటున రోజుకు 15 భూ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, తాజా నిబంధనతో రోజుకు 2 రిజిస్ట్రేషన్లూ గగనమేనని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 250 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, సర్వేయర్లు కొరత తీవ్రంగా ఉండగా, వారి డిమాండ్‌ కారణంగా పైరవీలు, అవినీతికి ఆస్కారం ఉందని ఆరోపించారు.

అదనపు చార్జీ చెల్లించినా.. చేయితడపక తప్పని స్థితి తలెత్తనుందని, సర్వేతో నష్టాలు, కష్టాలు తప్పవన్నారు. సర్వే కోసం రైతు అదనంగా ఫీజు చెల్లించాలని, సర్వే చేయాలని అధికారులను బతిమాలుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, కొలతలు, మ్యాప్‌ వచ్చే వరకు రిజిస్ట్రేషన్‌ జరగదని, సర్వే తర్వాత ఎంతోకొంత ముట్టజెప్పాల్సి వస్తుందని, రిజిస్ట్రేషన్ రైతుకు అత్యవసరమైతే డిమాండ్‌ మేర చెల్లించాలని కేటీఆర్ ఆరోపించారు. 

Tags:    

Similar News