కృష్ణా నదిపై ఏపీ వాదనలు అభ్యంతరకరం: తెలంగాణ
కృష్ణా ట్రిబ్యునల్ముందు ఆంధ్ర ప్రదేశ్వాదనలపై తీవ్రంగా అభ్యంతరం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.
దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ వాదనలపై తీవ్రంగా అభ్యంతరం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 6న కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వం వినిపించిన వాదనలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ శుక్రవారం కౌంటర్‌ను దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలను అదనంగా వినియోగించుకోవడానికి కొత్త తీర్పులో జాప్యం కావడానికి ఉద్దేశ పూర్వకంగా వాయిదాలు అడుగుతుందని, తప్పుడు వాదనలను వినిపిస్తుందని తెలంగాణ నీటి పారుదల శాఖ పేర్కొంది. కృష్ణా నది ఏపీ పరివాహక ప్రాంతం తక్కువగా ఉన్నప్పటికీ అధికంగా నీటిని వాడుకుంటుందని తెలంగాణ తెలిపింది. పరివాహక ప్రాంతం ఆధారంగా కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరుతుంది. నెట్టెంపాడు, ఏఎంఆర్ పీ నుంచి నీటిని తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కృష్ణా ట్రిబ్యునల్ ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌పై ఏపీ తరపు సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియ ముగిసింది. తెలంగాణ వేసిన ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ (ఐఏ) పై కౌంటర్ దాఖలు చేయాడానికి ఏపీకి రెండు వారాల గడువు ఇచ్చింది. జనవరి 16, 17 తేదీల్లో తదుపరి విచారణ జరగనుంది.