TG High Court: డబ్బు చెల్లింపుతో నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్

ఫార్ములా ఈ-రేసింగ్ కేసు (Formula E-Racing Case)లో ఏసీబీ దూకుడు పెంచింది.

Update: 2024-12-28 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేస్ కేసులో (Formula E-Racing Case)లో ఏసీబీ దూకుడు పెంచింది. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఇటీవలే కౌంటర్ దాఖలు చేసింది. అయితే, అందుకు కౌంటర్‌గా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో రిప్లై ఇస్తూ అఫిడవిట్ సమర్పించారు. ఆ ఆఫిడవిట్‌లో ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని వెల్లడించారు. ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని రిప్లై ఇచ్చారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులపై పర్మీషన్‌కు సంబంధించి సంబంధిత బ్యాంకే చూసుకోవాలని తెలిపారు. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌కు ప్రమోట్ చేసే ముందు చెల్లింపులకు సంబంధించి లీగల్ ఇష్యూస్ HMDA సంస్థ పరిగణలో ఉంటాయని అన్నారు. అదేవిధంగా రూ.10 కోట్లు దాటే చెల్లింపులకు కేబినెట్ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో లేదని పేర్కొన్నారు. నగర, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తనకు సంబంధం లేదని తెలిపారు. ఫార్ములా ఈ- కారు రేస్ 10వ సీజన్‌ పోటీలు హైదరాబాద్‌లో జరగలేదని, సంబంధిత సంస్థ నుంచి సొమ్ము రీఫండ్ కోరవచ్చని కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.

కాగా, ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఏసీబీ (ACB) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో కౌంటర్ పిటిషన్ (Counter Petition) దాఖలు చేసింది. కేసులో నిందితులు ప్రభుత్వ నిధుల దుర్వియోగం, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటూ అధికారులు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా క్యాబినెట్ అప్రువల్, ఆర్థిక శాఖ (Finance Department) అనుమతి లేకుండానే విదేశీ సంస్థ (Foreign Company)కు రూ.55 కోట్లు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అధికారులపై కేటీఆర్ (KTR) ఒత్తిడి తీసుకొచ్చి.. స్వతంత్ర సంస్థ అయిన హెచ్ఎండీఏ (HMDA)కు రూ.8 కోట్లు అదనపు భారం పడేలా చేశారని ఏసీబీ (ACB) అధికారులు కోర్టుకు విన్నవించారు. తనపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ (FIR)లను క్వాష్ చేయాలని కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదంటూ తాజాగా ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది.   Formula E-Car Race Case: ఒప్పందాలు, డబ్బు చెల్లింపుతో నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్ దాఖలు

Tags:    

Similar News