MLC Balmuri : డ్రగ్స్ రహిత సమాజానికి సహకరించాలి : ఎమ్మెల్సీ బల్మూరి
తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చేపట్టిన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ(Drug-free Telangana) డ్రగ్స్ ఫ్రీ సిటీ హైదరాబాద్(Drug Free City Hyderabad )సాధనకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat)కోరారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చేపట్టిన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ(Drug-free Telangana) డ్రగ్స్ ఫ్రీ సిటీ హైదరాబాద్(Drug Free City Hyderabad )సాధనకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat)కోరారు. ఎన్ ఎస్ యూఐ (NSUI)ఆధ్వర్యంలో చేపట్టిన మత్తు వదలారా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులను మత్తు పదార్ధాలకు దూరంగా ఉంచడంతో పాటు డ్రగ్స్ నిర్మూలనలో వారిని సైనికులుగా తీర్చిదిద్దేందుకు మేం మా వంతు కృషి చేస్తున్నామన్నారు.
టీజీ న్యాబ్ కు సంబంధించి డ్రగ్స్ నిర్మూలనకు చేస్తున్న కృషిలో విద్యార్థులు భాగస్వామ్యం అయ్యేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి పనిచేస్తుందన్నారు.