Food Poisoning: నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మంది విద్యార్థినులకు అస్వస్థత
రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ (Food Poisioning) ఘటన మరోసారి కలకలం రేపుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ (Food Poisioning) ఘటన మరోసారి కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని అనంతపేట్ (Ananthpet)లో ఉన్న కేబీబీవీ(KGBV) విద్యార్థినుకు హాస్టల్ నిర్వాహులు ఉడికీ ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అది తిని తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మొత్తం 10 మంది విద్యార్థినులు వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న ఎంఈవో వెంకటేశ్వర్లు (MEO Venkateshwarlu) విద్యార్థినులను చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో ఐదుగురి పరిస్థితి మెరుగుపడటంతో తిరిగి పాఠశాలకు పంపించారు. మరో ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో ఎంఈవోను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరారని, అన్నం వండటంలో సరైన అవగాహన లేక కొంత మేర ఉడకపోవడం, ఆ ఆహరాన్ని తినడం వల్లే విద్యార్థులు వాంతులు చేసుకున్నారని పేర్కొన్నారు.