సమస్య పరిష్కారంలో సర్కార్ విఫలం..: ఆదిలాబాద్ ఎమ్మెల్యే

ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట గత 13 రోజుల నుంచి కొనసాగుతున్న

Update: 2024-12-28 14:11 GMT

దిశ, ఉట్నూర్ : ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట గత 13 రోజుల నుంచి కొనసాగుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ల సమ్మె కి శనివారం సంఘీభావం తెలిపిన ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటని నిలబెట్ట కోకపోవడం సిగ్గు చేటు అన్నారు. సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం అయిందని మండిపడ్డారు. ఆరు నెలల వరకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలకు ఎలా పోషించాలని ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఈ సమ్మెలో బీజేపీ రాష్ట్ర నాయకులు రాథోడ్ రితేష్, జిల్లా నాయకులు,బానోత్ జగన్,జిల్లా ప్రధాన కార్యదర్శి కొండరి రమేష్,జిల్లా ఉపాధ్యక్షులు,మండల నాయకులు , సీఆర్టీ లు ఉన్నారు.


Similar News