రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి కప్ గెలవాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సీఎం కప్ 2024 లో భాగంగా 2 వ విడత జిల్లా స్థాయిలో విజేతలైన
దిశ, ఆదిలాబాద్ : సీఎం కప్ 2024 లో భాగంగా 2 వ విడత జిల్లా స్థాయిలో విజేతలైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొంది కప్ తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్నా పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారులను ఆయన శనివారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.సందర్భంగా యూనిఫాం టి షర్ట్ లను జిల్లా కలెక్టర్ అందజేసి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న సీఎం కప్ 2024 లో గ్రామ,మండల,జిల్లా లెవెల్ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు ఈ నెల 26న మొదటి బ్యాచ్ హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు 276 మంది క్రీడాకారులను పంపించడం జరిగిందని తెలిపారు. 2 వ విడత విజేతలైన క్రీడాకారులను 29, 30 వ తేదీల్లో అదే జిల్లాలకు ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేసిన బస్ లలో పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో గెలుపొంది, విజేతలుగా నిలిచి, క్రమశిక్షణ తో మెలిగి జిల్లాకు మంచి పేరుతో పాటు బహుమతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇందులో డి వై ఎస్ ఓ వెంకటేశ్వర్లు,ట్రైబల్ ఆఫీసర్ పార్థసారథి, వ్యాయామ ఉపాధ్యాయుల దయానంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.