మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి కేటీఆర్ నివాళులు
గురువారం రాత్రి భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఆయన మృతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: గురువారం రాత్రి భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్(Manmohan Singh) అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఆయన మృతికి బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(kcr) సంతాపం తెలిపారు. అలాగే పార్టీ తరఫున హాజరుకావాల్సిందిగా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణి గురుశరణ్ కౌర్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పరామర్శించి.. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానికి నివాలులు అర్పించిన వారిలో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. అలాగే రేపు ఢిల్లీలోని కాశ్మిర్ గేట్ సమీపంలో నిగమ్‌బోధ్ ఘాట్‌లో రేపు మన్మోహన్ అంత్యక్రియలు అధికారలాంచనాలతో జరగనున్నాయి. కాగా ఈ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు అక్కడే ఉండనున్నారు.