Sajjanar : న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో భారీ సైబర్ దోపిడీకి ప్లాన్ : సజ్జనార్ హెచ్చరిక
నూతన సంవత్సర శుభాకాంక్ష(New Year greetings)ల పేరుతో ఉన్నదంతా దోచుకునేందు(Robbery)కు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ప్లాన్ వేశారని సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్(V.C. Sajjanar) ఎక్స్ వేదికగా ప్రజలను హెచ్చరించారు(warns).
దిశ, వెబ్ డెస్క్ : నూతన సంవత్సర శుభాకాంక్ష(New Year greetings)ల పేరుతో ఉన్నదంతా దోచుకునేందు(Robbery)కు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ప్లాన్ వేశారని సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్(V.C. Sajjanar) ఎక్స్ వేదికగా ప్రజలను హెచ్చరించారు(warns). ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తి గత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందన్నారు. న్యూ ఇయర్ విషెస్ చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవన్నారు.
ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(ఏపీకే) ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల అధీనం లోకి వెళ్లిపోతుందని హెచ్చరించారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారని..కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని..అంతా జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ హెచ్చరించారు.