రాష్ట్రానికి వర్ష సూచన.. ఉదయం పొగమంచు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది..
దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈదురు గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తాయని తెలిపింది. శనివారం నుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అలాగే రాబోయే 5 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది.
కాగా నిన్న బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలక పాటి నుంచి వర్షాలు కురిశాయని మేడ్చల్, మల్కాజిగిరిలో 20 మిల్లీమీటర్లు, ములుగులో 5.5 మిల్లీమీటర్లు, హైదరాబాద్,షేక్‌పేటలో 6.8 మిల్లీమీటర్లు, బహదూర్‌పురలో 6.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నులులో 5.3 మిల్లీమీటర్లు, సిద్దిపేటలో 5.01 మిల్లీమీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 5.0 మిల్లీమీటర్లు, కరీంనగర్జిల్లా కేంద్రంలో 4.00 మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరిలో 3.8 మిల్లీమీటర్లు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 3.3 మిల్లీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3.0 మిల్లీమీటర్లు వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రాబోయే 5 రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు తగ్గుతాయని, కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతున్న ప్రాంతాల్లో హైదరాబాద్, పటాన్చెరువు, రాజేంద్రనగర్, హయత్‌నగర్, దుండిగల్, హకీంపేట, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రామగుండం, ఖమ్మం, భద్రాచలం, నల్గొండ ప్రాంతాలు ఉన్నాయని పేర్కొంది.