నా బెస్ట్ హస్బెండ్ అంటూ భర్తకు విష్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందరికీ సుపరిచితమే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘లౌక్యం’, ‘కరెంట్ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్ 2’, ‘బ్రూస్ లీ’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘విన్నర్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘జయ జానకి నాయక’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది.
దిశ, సినిమా: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందరికీ సుపరిచితమే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘లౌక్యం’, ‘కరెంట్ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్ 2’, ‘బ్రూస్ లీ’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘విన్నర్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘జయ జానకి నాయక’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కానీ, అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.
అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలు, భర్తతో దిగిన పిక్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. తన భర్తతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే.. శాంతా క్లాజ్ నాకు ఇచ్చిన అత్యుత్తమ బహుమతి నువ్వు.. నువ్వే నా బెస్ట్ కొడుకు, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ బ్రదర్ అండ్ బెస్ట్ భర్తవి.. ఐ లవ్ యూ ఎవర్ అండ్ ఫరెవర్’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు జాకీ భగ్నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.