CM Revanth Reddy: ఇండస్ట్రీ ప్రముఖులతో ముగిసిన భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఐటీ (IT), ఫార్మా (Pharma) రంగాలు ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో మూవీ ఇండస్ట్రీ (Movie Industry) కూడా తమకు అంతే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఐటీ (IT), ఫార్మా (Pharma) రంగాలు ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో మూవీ ఇండస్ట్రీ (Movie Industry) కూడా తమకు అంతే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center)లో టాలీవుడ్ (Tollywood) సినీ ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నంది అవార్డు (Nandi Awards)ల తరహాలోనే త్వరలో గద్దర్ అవార్డు (Gaddar Awards)లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఈ విషయంలో టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju)కు బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. సమావేశంలో భాగంగా పార్టిసిపేట్ (Participate), ప్రమోట్ (Promote), ఇన్వెస్ట్ (Invest) నినాదాన్ని సీఎం వినిపించారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమ రైలు పట్టాల్లాంటివని అన్నారు. ఇప్పటి వరకు మాట్లాడుకోని అంశాలపై ఉన్న అభిప్రాయాలను.. మార్చుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడిందని అన్నారు. తన హయాంలో సినీ ఇండస్ట్రీ (Film industry)కి ఇప్పటి వరకు 8 జీవోలు ఇచ్చామని గుర్తు చేశారు. అదేవిధంగా స్పెషల్ ఇన్సెంటివ్స్ అందించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి: నటుడు నాగార్జున
యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక.
తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయ: దర్శకుడు రాఘవేంద్ర రావు
తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి. గతంలో సీఎం చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలి. అందరు ముఖ్యమంత్రులు తెలుగు సినిమా పరిశ్రమను బాగానే చూసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాం.
ఎన్నికల ఫలితాలు ఎలానో.. సినిమా రిలీజ్ ఫస్ట్ డే అంతే: నటుడు మురళీ మోహన్
ఎన్నికల ఫలితాలు ఎలానో.. సినిమా రిలీజ్ రోజు కూడా అలానే ఉంటుంది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన మమ్మల్ని తీవ్రంగా బాధించింది. సినిమా రిలీజ్‌లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల అవుతుండటంతో ప్రమోషన్‌ను పెద్ద ఎత్తున చేయడం అవసరం.
ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది.. నిర్మాత సరేష్ బాబు
హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలన్నదే మా కల. ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆనాడు సర్కార్ చేసిన సాయంతోనే చెన్నై నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలి.
Read More...
సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు: రాఘవేంద్రరావు