సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు: రాఘవేంద్రరావు

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు పాల్గొన్నారు.

Update: 2024-12-26 07:09 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు(Director Raghavendra Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పుష్పగుచ్చ అందజేసి.. శాలువాతో సన్మానించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సీఎంల లాగే ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది అని కొనియాడారు. అలాగే తెలుగు సినిమాల ప్రోడ్యూసర్ అయిన దిల్‌ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్‌లో చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గుర్తు చేస్తూ.. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌(International Film Festival)ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నానని దర్శకుడు రాఘవేంద్రరావు సమావేశంలో చెప్పుకొచ్చారు.

Read More...

ఈరోజు తెలుగు నిర్మాతలకు శుభదినం: అల్లు అరవింద్



Similar News