Mokshagna : మోక్షజ్ఞ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ బాబీ

బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ ( Mokshagna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-12-26 07:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొడుకు మోక్షజ్ఞ ( Mokshagna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడన్నప్పటి నుంచి ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఫస్ట్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.

గతంలో మోక్షజ్ఞ పై స్టార్ హీరోలు, డైరెక్టర్స్ కామెంట్స్ చేశారు. బాబీ ( Bobby) డైరెక్షన్ లో తెరకెక్కిన బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా డైరెక్టర్ బాబీ మోక్షజ్ఞపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాబీ మాట్లాడుతూ.. " మోక్షజ్ఞ ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు సెట్ కి వచ్చారు. అతన్ని చూస్తే ఆరడుగులు, చాలా షార్ప్ ఫ్యూచర్స్, చాలా నేర్చుకోవాలని అనుకుంటాడు. ఒక డైరెక్టర్ గా చెబుతున్నా ..ఇలాంటి కుర్రాడు దొరికితే బావుంటుందని అనిపించింది. తీసే అవకాశం వచ్చినా ఎవరూ వద్దనుకోరు అంటూ " చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం, ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Tags:    

Similar News