దారేమో ఇలా.. మరి గమ్యం చేరడం ఎలా..?

దిశ, నిర్మల్ కల్చరల్: చినుకు పడితే ఛిద్రమే అన్నట్లుగా తయారయ్యాయి నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల రహాదారులు.. కాంక్రీటు,తారు లేచిపోయి అడుగులోతు గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు వాటిలో నీళ్లునిండి వాహనదారులకు ప్రమాద భరితంగా మారాయి. పట్టణ పొలిమేరలోని క్రషర్ రోడ్డు నుండి మహాలక్ష్మి కాలనీ ఆలయానికి వెళ్లే రోడ్డుమార్గం గుంతలమయంగా మారడంతో వాహనదారులు పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా దివ్యనగర్, దత్తాత్రేయనగర్, ప్రియదర్శిని నగర్, ఆదర్శనగర్ తదితర కాలనీలలోని అంతర్గత రహదారులన్నీ ఇదేవిధంగా ఉన్నాయి. […]

Update: 2021-09-30 03:54 GMT

దిశ, నిర్మల్ కల్చరల్: చినుకు పడితే ఛిద్రమే అన్నట్లుగా తయారయ్యాయి నిర్మల్ పట్టణంలోని పలు కాలనీల రహాదారులు.. కాంక్రీటు,తారు లేచిపోయి అడుగులోతు గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు వాటిలో నీళ్లునిండి వాహనదారులకు ప్రమాద భరితంగా మారాయి. పట్టణ పొలిమేరలోని క్రషర్ రోడ్డు నుండి మహాలక్ష్మి కాలనీ ఆలయానికి వెళ్లే రోడ్డుమార్గం గుంతలమయంగా మారడంతో వాహనదారులు పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా దివ్యనగర్, దత్తాత్రేయనగర్, ప్రియదర్శిని నగర్, ఆదర్శనగర్ తదితర కాలనీలలోని అంతర్గత రహదారులన్నీ ఇదేవిధంగా ఉన్నాయి. ఆయా రోడ్లకు పూర్తిస్థాయిలో మరమతులు చేపట్టాలని పట్టణవాసులు,వాహనదారులు కోరుతున్నారు.

Tags:    

Similar News