పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును డీసీఎం లారీ ఢీ కొట్టిన ఘటన జిల్లాలోని మంథనిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది తీవ్రగాయలు అయినట్లు తెలుస్తోంది. అయితే మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును  డీసిఎం వ్యాన్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. […]

Update: 2021-11-13 23:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును డీసీఎం లారీ ఢీ కొట్టిన ఘటన జిల్లాలోని మంథనిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 24 మంది తీవ్రగాయలు అయినట్లు తెలుస్తోంది. అయితే మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును డీసిఎం వ్యాన్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ఓ వర్ స్పీడ్‌తో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News