ఇద్దరు యువకుల ప్రాణం తీసిన ఆర్టీసీ బస్సు
దిశ, ధర్మపురి : ధర్మపురిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను, ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే.. ఆటో ధర్మపురి నుంచి బూర్గు పల్లె వెళ్తుంది. ఈ క్రమంలో జగిత్యాలవైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మపురి శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్దగల జాతీయ రహదారిపై బస్సు, ఆటోను ఢీ కొంది. మృతులలో ధర్మపురి మండలం […]
దిశ, ధర్మపురి : ధర్మపురిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆటోను, ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే.. ఆటో ధర్మపురి నుంచి బూర్గు పల్లె వెళ్తుంది. ఈ క్రమంలో జగిత్యాలవైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మపురి శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్దగల జాతీయ రహదారిపై బస్సు, ఆటోను ఢీ కొంది. మృతులలో ధర్మపురి మండలం బూర్గు పల్లె గ్రామానికి చెందిన అలకొండ అక్షయ్(17), సంపంగి అంజి (20) గా పోలీసులు గుర్తించారు. సీఐ కొటేశ్వర్, ఎస్ఐ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేసి మృత దేహాలను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.