ఘోర ప్రమాదం.. తల్లి మృతి, కూతుళ్లకు తీవ్ర గాయాలు

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరండ్లపల్లి బస్టాండ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు టీచర్ మాదాసు పద్మ(35) దుర్మరణం పాలైంది. వివరాల ప్రకారం.. పద్మ స్కూటీని ఎదురుగా వస్తున్న మరో స్కూటీ ఢీ కొట్టింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కారు కింద పడి పద్మ మృతి చెందింది. ఈ ప్రమాదంలో పద్మతో వెళ్తున్న ఇద్దరు కూతుళ్లకు తీవ్రగాయాలు కాగా.. వారిని జగిత్యాల ప్రభుత్వ ప్రధాన […]

Update: 2021-11-13 11:04 GMT

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరండ్లపల్లి బస్టాండ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు టీచర్ మాదాసు పద్మ(35) దుర్మరణం పాలైంది. వివరాల ప్రకారం.. పద్మ స్కూటీని ఎదురుగా వస్తున్న మరో స్కూటీ ఢీ కొట్టింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కారు కింద పడి పద్మ మృతి చెందింది.

ఈ ప్రమాదంలో పద్మతో వెళ్తున్న ఇద్దరు కూతుళ్లకు తీవ్రగాయాలు కాగా.. వారిని జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags:    

Similar News