అధికారుల నిర్లక్ష్యం.. అకాల వర్షానికి అన్నదాతకు అరిగోస
దిశ, సుల్తానాబాద్ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో, సుల్తానాబాద్‌లో శనివారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్‌లోని వరి ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందిన సమయంలో అకాల వర్షం వల్ల మార్కెట్‌లో ఆరబోసి అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం వర్షార్పణం అయ్యింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వచేసిన వడ్లు తడిసిపోయాయి. ధాన్యంపై టార్పాలిన్లు కప్పేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. ఈ నేపథ్యంలో తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని […]
దిశ, సుల్తానాబాద్ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో, సుల్తానాబాద్‌లో శనివారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్‌లోని వరి ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందిన సమయంలో అకాల వర్షం వల్ల మార్కెట్‌లో ఆరబోసి అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం వర్షార్పణం అయ్యింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వచేసిన వడ్లు తడిసిపోయాయి. ధాన్యంపై టార్పాలిన్లు కప్పేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు.
ఈ నేపథ్యంలో తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మ్యాచర్ వచ్చినా కూడా వడ్లు కొనుగోలు చేయడం లేదని, అధికారులు తూకం తొందరగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. మందకొడిగా కొనుగోలు చేయడం అధికారుల అలసత్వానికి నిదర్శనంలా కనబడుతోందని, రైతుల అవస్థలను గమనించి వెంటనే కొనుగోలు పూర్తి చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.