మర్డర్‌ అటెంప్ట్ కేసు.. కోర్టులో సాక్ష్యం చెప్పిన రేవంత్ రెడ్డి

దిశ, నారాయణపేట: టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని కోర్టుకు హాజరయ్యారు. 2009లో కొడంగల్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్‌కు చెందిన అప్పటి కాంగ్రెస్ నాయకుడైన కృష్ణతో పాటు మరో 12 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో రేవంత్ రెడ్డి పిటిషనర్‌గా ఉన్నారు. ఇదే కేసు విషయంలో 2018, ఆగస్టులో నారాయణపేట కోర్టుకు వచ్చారు. తాజాగా శుక్రవారం ఆ కేసుకు సంబంధించి పిటిషనర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి […]

Update: 2021-10-22 10:47 GMT

దిశ, నారాయణపేట: టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని కోర్టుకు హాజరయ్యారు. 2009లో కొడంగల్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్‌కు చెందిన అప్పటి కాంగ్రెస్ నాయకుడైన కృష్ణతో పాటు మరో 12 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో రేవంత్ రెడ్డి పిటిషనర్‌గా ఉన్నారు. ఇదే కేసు విషయంలో 2018, ఆగస్టులో నారాయణపేట కోర్టుకు వచ్చారు. తాజాగా శుక్రవారం ఆ కేసుకు సంబంధించి పిటిషనర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి జిల్లా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు.

టీపీసీసీగా మొదటిసారి జిల్లాకు..

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారిగా నారాయణపేట జిల్లాకు రావడంతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చిట్టెం అభిజయ్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కోర్టు కేసు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కలిసి మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా అన్ని విధాలా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని వారికి సూచించారు.

Tags:    

Similar News