కరీంనగర్‌లో ఆంక్షల సడలింపు : జిల్లా కలెక్టర్ శశాంక
దిశ, కరీంనగర్ : కరీంనగర్‌లో మొట్టమొదట ఏర్పాటు చేసిన నో ఎంట్రీ జోన్‌లో ఉన్న ఆంక్షలను పాక్షికంగా సడలిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శశాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం నుంచి ఆ ప్రాంతంలోని నాలుగు గేట్లను 4గంటల పాటు ఓపెన్ చేస్తామన్నారు. మిగతా రోజుల్లో గంట చొప్పున పెంచుకుంటూ ఆంక్షలను నెమ్మదిగా సడలిస్తామని కలెక్టర్ వివరించారు. తొలగించిన గేట్ల వద్ద వైద్య బృందాలు ఉంటారని, వారు వచ్చి వెళ్లే ప్రజలకు ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతారని తెలిపారు. ఆంక్షల […]
దిశ, కరీంనగర్ : కరీంనగర్‌లో మొట్టమొదట ఏర్పాటు చేసిన నో ఎంట్రీ జోన్‌లో ఉన్న ఆంక్షలను పాక్షికంగా సడలిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శశాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం నుంచి ఆ ప్రాంతంలోని నాలుగు గేట్లను 4గంటల పాటు ఓపెన్ చేస్తామన్నారు. మిగతా రోజుల్లో గంట చొప్పున పెంచుకుంటూ ఆంక్షలను నెమ్మదిగా సడలిస్తామని కలెక్టర్ వివరించారు. తొలగించిన గేట్ల వద్ద వైద్య బృందాలు ఉంటారని, వారు వచ్చి వెళ్లే ప్రజలకు ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతారని తెలిపారు. ఆంక్షల సడలింపు సమయంలో ప్రజలు అత్యవసర పనుల కోసమే బయటకు రావాలని, కారణం లేకుండా బయటకు రాకూడదని ఆయన సూచించారు. విపత్కర సమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడమే కాకుండా, సామాజిక దూరం పాటించాలన్నారు.
Tags: carona, lockdown, restrictions, removed, karimnagar, collecter shashanka