కార్లు అద్దెకు తీసుకుని తాకట్టు.. రూ.2 కోట్లకు కుచ్చుటోపి

దిశ, వెబ్‌డెస్క్ : అవసరం రీత్యా కార్లు అద్దెకు తీసుకుని ఆపై తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ముఠాను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. పలు వాహన ఏజెన్సీ సంస్థల నుంచి అవసరం రీత్యా కార్లను అద్దెకు తీసుకుని ఆ తర్వాత వాటిని తాకట్టు పెట్టి డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 29 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి […]

Update: 2021-06-11 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అవసరం రీత్యా కార్లు అద్దెకు తీసుకుని ఆపై తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ముఠాను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. పలు వాహన ఏజెన్సీ సంస్థల నుంచి అవసరం రీత్యా కార్లను అద్దెకు తీసుకుని ఆ తర్వాత వాటిని తాకట్టు పెట్టి డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 29 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ముఠాలో ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులో ఉండగా, మరొకరు తప్పించుకున్నారు. ప్రధాన నిందితుడు పార్వతీపురానికి చెందిన చంద్రమౌళిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News