4 వేల మంది ఉద్యోగుల బమోమెట్రిక్ తొలగింపు.. నిరసనగా కార్మికుల ధర్నా

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు యాజామన్యం సిద్ధం కావడంతో వర్కర్స్ అంతా భారీ ధర్నాకు పిలుపునిచ్చారు.

Update: 2024-09-28 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు యాజామన్యం సిద్ధం కావడంతో వర్కర్స్ అంతా భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. అడ్మిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. ఓవైపు సెయిల్‌లో స్టీల్‌ ప్లాంట్‌ విలీనం చేస్తారంటూ రూమర్లు బయటకొచ్చిన కొద్ది గంటల్లోనే భారీ స్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేసే 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు కోల్పోనున్నారు.

స్టీల్ సెక్రటరీ ఆదేశాల మేరకు బయోమెట్రిక్ నుంచి కార్మికుల ఐడీలు కూడా తొలగించడం జరిగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం బ్లాస్ట్ ఫర్నేస్ ఒక్కటే నడుస్తున్నందున కాంట్రాక్టు కార్మికులలో కోత పెట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే 2500 మందికి ఆఫర్‌ ఇచ్చిన యాజమాన్యం.. దీని కోసం రూ.14 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది.

కాగా.. ఇప్పటికే డిప్యుటేషన్ పేరుతో 500 మంది కార్మికులను నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌కు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, ఇదంతా ఉత్పత్తి వ్యయం తగ్గించుకునే ప్రయత్నమంటూ ఆర్ఐఎన్ఎల్ చెబుతున్నా.. కార్మిక సంఘాలు మాత్రం దీన్ని ప్రైవేటీకరణలో భాగంగా చేస్తున్న కుట్రే అంటూ ఆందోళనకు దిగారు.


Similar News