విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. సైకిలెక్కిన పలువురు కార్పొరేటర్లు

విశాఖలో మరోసారి వైసీపీకి బిగ్ షాక్ తగిలింది...

Update: 2024-11-27 16:59 GMT

దిశ, వెబ్ డెస్క్:విశాఖలో మరోసారి వైసీపీ(Ycp)కి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా వైఎస్ జగన్(Ys Jagan) పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. పలువురు కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు(MLA Velagapudi Ramakrishnababu), జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు(GVMC floor leader Pela Srinivasa Rao) సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీ(Tdp) జెండా కప్పుకున్నారు. వీరందంరినీ రామకృష్ణబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి విశాఖలో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని వెలగపూడి రామకృష్ణ తెలిపారు. 


Similar News