Breaking: విశాఖ ఎయిర్ పోర్టులో ప్రమాదకర బల్లుల కలకలం
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ..
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు(Visakhapatnam Airport)లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డీఆర్‌ఐ, అటవీ సర్వీస్ అధికారుల(DRI and Forest Service Officers) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ప్రమాదకర బల్లులు తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ బల్లులను థాయ్‌లాండ్(Thailand) నుంచి అక్రమంగా బల్లులను భారత్(India)కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బల్లులను ఎవరు, ఎవరికి పంపిస్తున్నారనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు. నిషేధిత వస్తువులు, జంతువులు తరలించడం నేరమని, ఈ బల్లులు అత్యంత ప్రమాదకరమైనవని, వీటి తరలింపు వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని అధికారులు హెచ్చరించారు. రహస్య మార్గాల్లో అరుదైన వన్యప్రాణులను భారత దేశానికి తరలించేందుకు చేసే ప్రయత్నాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.