Ap News: జగన్‌కు బిగ్ షాక్.. ఇళ్ల లే అవుట్లపై ఎంక్సైరీ షురూ

జగనన్న ఇళ్ల లే అవుట్ల అవకతవకలపై విజిలెన్స్ అధికారుల విచారణ ప్రారంభం అయింది...

Update: 2024-11-23 13:03 GMT

దిశ, వెబ్ డెస్క్: జగనన్న లే అవుట్ల(Jagananna Layouts)లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో జగనన్న లే అవుట్లలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. అంతేకాదు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే కొన్ని చోట్ల ఇళ్లు నిర్మించలేదు. ఇందుకారణం అవకతవకలేననే ఆరోపణలు వినిపించాయి. విచారణ జరిపాలనే డిమాండ్లు వినిపించాయి.

ప్రధానంగా విశాఖ జిల్లా పెందుర్తి(Visakha District Pendurthi) జగనన్న లేఅవుట్లలో అవకతవకలు జరిగినట్లు విమర్శలు సైతం వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్ అధికారులు(Vigilance officers) తాజాగా తనిఖీలు చేపట్టారు. పెందుర్తి తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు చేశారు. జగనన్న లే అవుట్లకు సంబంధించిన పలు ఫైళ్లను పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయం సిబ్బందిని విచారించారు. కొన్ని ఫైళ్లలో అవకతవకలు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ తహశీల్దార్ కార్యాలయం సిబ్బందితో పాటు గత ప్రభుత్వంలో పని చేసిన నాయకుల్లో నెలకొంది. 

Tags:    

Similar News