అకస్మాత్తుగా.. ఇద్దరు ఆర్డీఓలు బదిలీ
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఆర్డీఓలు బదిలీ అయ్యారు. సూర్యాపేట ఆర్డీఓ ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడేండ్లుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటిoగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీఓగా కే.రాజేంద్ర కుమార్‌ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా దేవరకొండ ఆర్డీఓగా పనిచేస్తున్న గుగులోతు లింగ్యానాయక్ సైతం బదిలీ అయ్యారు. కొత్తగా దేవరకొండ ఆర్డీఓగా […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఆర్డీఓలు బదిలీ అయ్యారు. సూర్యాపేట ఆర్డీఓ ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడేండ్లుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటిoగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీఓగా కే.రాజేంద్ర కుమార్‌ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా దేవరకొండ ఆర్డీఓగా పనిచేస్తున్న గుగులోతు లింగ్యానాయక్ సైతం బదిలీ అయ్యారు. కొత్తగా దేవరకొండ ఆర్డీఓగా కె.గోపీరాం నియమితులయ్యారు. అయితే సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన మోహన్ రావు, దేవరకొండ ఆర్డీఓ లింగ్యానాయక్‌లను రెవెన్యూ శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ఇద్దరు ఆర్డీఓలను వెయిటింగ్‌లో పెడుతూ రెవెన్యూ శాఖకు రిపోర్టు చేయాలనే ఈ అంశం ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.