‘రాయిటర్స్’ దిద్దుబాటు..

         ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన కియా మోటార్స్ తరలింపు వివాదంపై రాయిటర్స్ వెనక్కి తగ్గింది. కియామోటార్స్ ఏపీ నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకి తరలుతోందని సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌ను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ శనివారం ప్రకటించింది. ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో పెద్ద దూమారం రేపింది. దక్షిణకోరియాకు చెందిన కియా మోటార్స్ ఏపీలోని అనంతరంపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో తన మ్యానుఫాక్చరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ వెనక్కి […]

Update: 2020-02-08 10:00 GMT

ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన కియా మోటార్స్ తరలింపు వివాదంపై రాయిటర్స్ వెనక్కి తగ్గింది. కియామోటార్స్ ఏపీ నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకి తరలుతోందని సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌ను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ శనివారం ప్రకటించింది. ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో పెద్ద దూమారం రేపింది. దక్షిణకోరియాకు చెందిన కియా మోటార్స్ ఏపీలోని అనంతరంపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో తన మ్యానుఫాక్చరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ వెనక్కి వెళ్లిపోతే దాదాపు రూ.14వేల కోట్ల పెట్టుబడులతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాలు పోతాయని టీడీపీ నాయకులు అధికార వైసీపీ పార్టీని విమర్శించారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలన్నింటిని సీఎం జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో వెళ్లగొడుతున్నాడని మండిపడ్డారు. దీనిపై స్పందించిన వైసీపీ ప్రభుత్వం కియా కంపెనీ ఎక్కడికి వెళ్లడంలేదని వివరణ ఇచ్చుకుంది. కియా కంపెనీ మార్కెటింగ్ ఎండీ కూడా ఊహాగానాలను నమ్మొద్దని తాము అనంతపురంలోనే తమ ఉత్పత్తులను కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

Tags:    

Similar News