Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. మళ్లీ 24,000 పాయింట్లు దాటిన నిఫ్టీ..!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) అందరూ ఊహించినట్టుగానే ఈ వారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

Update: 2024-11-25 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) అందరూ ఊహించినట్టుగానే ఈ వారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల(Global Markets) నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడం, అలాగే మహారాష్ట్ర(MH) అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి(Mahayuti Alliance) ఘన విజయం సాధించడంతో మన బెంచ్ మార్క్ సూచీలు సోమవారం రాణించాయి. ముఖ్యంగా ఈ రోజు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank), ఎల్&టీ(L&T), ఐసీఐసీఐ(ICICI), రిలయన్స్(Relliance) షేర్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 80,193.47 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలై మార్కెట్ ముగిసే వరకు లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 1300 పాయింట్లకు పైగా లాభపడి 80,473.08 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 992.74 పాయింట్ల లాభంతో 80,109.85 వద్ద స్థిరపడింది. మరోవైప్పు నిఫ్టీ(Nifty) సైతం 314.65 పాయింట్లు పెరిగి 24,221.90 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.30కి చేరుకుంది.

లాభాల్లో ముగిసిన షేర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్&టీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్

నష్టాల్లో ముగిసిన షేర్లు : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 

Tags:    

Similar News