Pushpa-2: 24 గంటల్లోపే 25 మిలియన్స్.. దూసుకుపోతున్న కిస్ కిసిక్కు
ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ ‘కిస్ కిసిక్కు’.
దిశ, సినిమా: ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ ‘కిస్ కిసిక్కు’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప-2’ (Pushpa-2) మూవీ నుంచి తాజాగా ‘కిసిక్’ (Kissik) సాంగ్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి DSP సంగీతం అందిచగా.. అల్లు అర్జున్ (Allu Arjun), డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) స్టెప్పులతో అదరగొట్టారు. దీంతో ప్రజెంట్ ఎక్కడ విన్నా, చూసిన ‘కిస్ కిసిక్’ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ఈ క్రమంలోనే రిలీజైన 24 గంటలలోపే 25 మిలియన్స్ పైనే వ్యూస్ సొంతం చేసుకుని.. సౌత్‌లోనే నెంబర్ వన్ సాంగ్‌గా దూసుకుపోతుంది.
ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘సౌత్‌లో 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న సాంగ్స్ రికార్డులను ‘కిసిక్’ సాంగ్ కేవలం 18 గంటల్లో బద్దలు కొట్టింది. ‘కిసిక్’ తెలుగు లిరికల్ వీడియో ఒక్కసారిగా 25 మిలియన్+ వీక్షణలను సాధించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ & డ్యాన్స్ క్వీన్ శ్రీలీల డ్యాన్స్ ట్రీట్ & రాక్ స్టార్ DSP యెక్క మ్యూజికల్ ట్రీట్ (Musical Treat) ప్రేక్షకులను మాములుగా ఆకట్టుకోవడం లేదు’ అంటూ చెపుకొచ్చారు.
కాగా.. సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ‘కిసిక్’ సాంగ్ కూడా వీర లెవల్‌లో దూసుకుపోతోంది. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్‌తో పాటు సిని ప్రేమికులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.