పెద్దన్న, భైరవ భేష్.. నేనూ చేస్తా! : జక్కన్న
దిశ, వెబ్ డెస్క్: సంగీత దర్శకులు కీరవాణి, ఆయన తనయుడు కాల భైరవ కరోనా నుంచి కోలుకోవడంతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో ప్లాస్మా దానం చేశారు. కాగా, ప్లాస్మా దానం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన కాల భైరవ.. కరోనా నుంచి కోలుకున్న ప్రతీ ఒక్కరు ప్లాస్మా డొనేట్ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. యాంటీ బాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయో లేదో టెస్ట్ చేయించుకుని వెంటనే డొనేట్ చేయాలన్నారు. ఎమర్జెన్సీ వరకు ఆగకుండా ముందుకు రావాలని […]
దిశ, వెబ్ డెస్క్:
సంగీత దర్శకులు కీరవాణి, ఆయన తనయుడు కాల భైరవ కరోనా నుంచి కోలుకోవడంతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో ప్లాస్మా దానం చేశారు. కాగా, ప్లాస్మా దానం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపిన కాల భైరవ.. కరోనా నుంచి కోలుకున్న ప్రతీ ఒక్కరు ప్లాస్మా డొనేట్ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. యాంటీ బాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయో లేదో టెస్ట్ చేయించుకుని వెంటనే డొనేట్ చేయాలన్నారు. ఎమర్జెన్సీ వరకు ఆగకుండా ముందుకు రావాలని సూచించారు.
కాగా కీరవాణి, కాల భైరవ ప్లాస్మా డొనేట్ చేయడాన్ని అభినందించారు దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి. తను కూడా యాంటీ బాడీస్ కోసం టెస్ట్ చేయించుకున్నానని.. కానీ తన ఐజీజీ లెవల్స్ 8.62 మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్లాస్మా డొనేట్ చేయాలంటే 15 ఉండాలని తెలిపిన జక్కన్న.. ప్లాస్మా డొనేషన్‌ను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
కాగా ఈ మధ్య ప్లాస్మా డొనేట్ చేసిన వారి అభినందన కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న.. సమాజం బాగుకోసం కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నం చూసి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్లాస్మాను కరోనాపై వజ్రాయుధంగా అభివర్ణించారు.
Tested for antibodies.. My igG levels are 8.62. They should be above 15 to be able to donate… Peddanna and Bhairava donated today… pic.twitter.com/5zVmj0dvt0
— rajamouli ss (@ssrajamouli) September 1, 2020