మహిళలను వేధిస్తున్న వ్యక్తి అరెస్టు
దిశ, క్రైమ్ బ్యూరో : ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర ఆన్ లైన్ వేదికల ద్వారా మహిళలను వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన బోయ హరినారయణ 2018లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అనేక ఫేస్ బుక్ ఖాతాలను క్రియేట్ చేస్తూ ఆన్ లైన్‌లో చాటింగ్ చేస్తూండేవాడు. ఈ క్రమంలో కావ్య, లక్కీ, భవానీ ఫోన్ నెంబర్లను గమనించాడు. తరుచూ ఆ ఖాతాలకు మెస్సేజ్ […]
దిశ, క్రైమ్ బ్యూరో : ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర ఆన్ లైన్ వేదికల ద్వారా మహిళలను వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన బోయ హరినారయణ 2018లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అనేక ఫేస్ బుక్ ఖాతాలను క్రియేట్ చేస్తూ ఆన్ లైన్‌లో చాటింగ్ చేస్తూండేవాడు. ఈ క్రమంలో కావ్య, లక్కీ, భవానీ ఫోన్ నెంబర్లను గమనించాడు. తరుచూ ఆ ఖాతాలకు మెస్సేజ్ లు పంపడం ప్రారంభించాడు. ఈ సమయంలో మరోసారి మెస్సేజ్ లు పంపవద్దని బాధితులు బదులిచ్చారు. దీంతో సిసిరా పేరుతో మరో అకౌంట్‌ను సృష్టించిన హరినారాయణ… ఫేస్ బుక్‌లో ఇతర అకౌంట్‌లకు అసభ్యకరమైన సందేశాలను తెలియని ఫేస్ బుక్, వాట్సాప్ నెంబర్లకు పంపడం ప్రారంభించాడు.
దీంతో బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మొబైల్ నెంబరుకు లింక్ చేయబడిన harinarayana799@gmail.com, harinarayana9966@gmail.com మెయిల్ ఐడీలతో పాటు hari.narayana.9822924 ఫేస్ బుక్ ఖాతాను కూడా వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఐఓఓ సాంకేతిక ఆధారాలను సేకరించి, డేటాను విశ్లేషించిన అనంతరం నిందితుడిని కర్నూలు జిల్లా కల్లూర్ మండలం బస్తీపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సందర్భంగా నిందితుడు హరినారాయణ (23)ను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ ఆర్.వెంకటేష్ తెలిపారు.