బీజేపీ కీలక నిర్ణయం.. ఉత్తరాఖండ్ సీఎంగా ఆయనే ఫిక్స్..
డెహ్రూడూన్: ఉత్తరాఖండ్ సీఎం పదవిని పుష్కర్ సింగ్ ధామీ చేపట్టనున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం కొత్త సీఎంను ఎన్నుకునేందుకుగాను బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి 57 మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కేంద్ర పరిశీలకులు నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర ఇంఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్‌లు హాజరయ్యారు. సీఎం పదవి కోసం సత్పాల్ సింగ్, ధన్ రాజ్‌సింగ్, పుష్కర్ సింగ్ ధామీ మధ్య పోటీ నెలకొంది. దీంతో సమావేశానికి […]
డెహ్రూడూన్: ఉత్తరాఖండ్ సీఎం పదవిని పుష్కర్ సింగ్ ధామీ చేపట్టనున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం కొత్త సీఎంను ఎన్నుకునేందుకుగాను బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి 57 మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కేంద్ర పరిశీలకులు నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర ఇంఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్‌లు హాజరయ్యారు. సీఎం పదవి కోసం సత్పాల్ సింగ్, ధన్ రాజ్‌సింగ్, పుష్కర్ సింగ్ ధామీ మధ్య పోటీ నెలకొంది. దీంతో సమావేశానికి ముందు పలువురు రాష్ట్ర నాయకులతో తోమర్ చర్చలు జరిపారు. అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు సన్నిహితుడిగా పేరున్న పుష్కర్ సింగ్ ధామీవైపే పార్టీ మొగ్గు చూపింది. దీంతో తదుపరి సీఎంగా పుష్కర్ సింగ్ ధామీని ఎన్నుకున్నట్టు సమావేశం అనంతరం లెజిస్లేటివ్ పార్టీ ప్రకటించింది.