పొత్తులపై స్పందించిన పురంధేశ్వరి 

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గం లిస్ట్ విడుదల చేశారు. ఈ జాబితాలో ఏపీ బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. దీనిపై స్పందించిన పురంధేశ్వరి… జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిఒక బాధ్యత అని భావిస్తున్నాను అన్నారు. దక్షిణాదిలో బీజేపీ ఉనికి ఉంది.. దానిని మరింత బలోపేతం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రైతు బిల్లులపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. భవిష్యత్తులో […]

Update: 2020-09-26 23:59 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గం లిస్ట్ విడుదల చేశారు. ఈ జాబితాలో ఏపీ బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. దీనిపై స్పందించిన పురంధేశ్వరి… జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిఒక బాధ్యత అని భావిస్తున్నాను అన్నారు. దక్షిణాదిలో బీజేపీ ఉనికి ఉంది.. దానిని మరింత బలోపేతం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

రైతు బిల్లులపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. భవిష్యత్తులో పొత్తుల విషయంపై భవిష్యత్తే తేలుస్తుంది అంటూ సమాధానమిచ్చారు.ఏపీ పరిణామాలు, సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి మారలేదని స్పష్టం చేశారు. రాజధాని విషయం కోర్టులో ఉందని, న్యాయస్థానమే నిర్ణయిస్తుందని దగ్గుబాటి పురంధేశ్వరి తేల్చి చెప్పారు.

Tags:    

Similar News