కుక్కలు పుట్టేది మనుషులతో మాట్లాడేందుకే!
దిశ, ఫీచర్స్: పెంపుడు జంతువులతో మనిషిది విడదీయరాని బంధం. ఈ క్రమంలో ఎన్ని జీవులను చేరదీసినా జంతు ప్రపంచంలో మనిషికి అత్యంత ఆప్తమిత్రులు మాత్రం శునకాలే. దాదాపు 11 వందల సంవత్సరాల నుంచి మానవుడు కుక్కలను పెంచుకుంటున్నట్టు గతంలో ఓ అధ్యయనం వివరించగా, ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. మీరు మీ పెంపుడు కుక్కకు ఫుడ్ తినమని, ఏదైనా వస్తువును మరోచోట పెట్టమని చెప్తే అర్ధం చేసుకుంటుందని అనుకుంటున్నారా? అయితే ఈ విషయంలో మీ భావన […]
దిశ, ఫీచర్స్: పెంపుడు జంతువులతో మనిషిది విడదీయరాని బంధం. ఈ క్రమంలో ఎన్ని జీవులను చేరదీసినా జంతు ప్రపంచంలో మనిషికి అత్యంత ఆప్తమిత్రులు మాత్రం శునకాలే. దాదాపు 11 వందల సంవత్సరాల నుంచి మానవుడు కుక్కలను పెంచుకుంటున్నట్టు గతంలో ఓ అధ్యయనం వివరించగా, ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. మీరు మీ పెంపుడు కుక్కకు ఫుడ్ తినమని, ఏదైనా వస్తువును మరోచోట పెట్టమని చెప్తే అర్ధం చేసుకుంటుందని అనుకుంటున్నారా? అయితే ఈ విషయంలో మీ భావన కరెక్టేనని ప్రముఖ సైంటిస్టు తాజాగా నిర్ధారించారు.
ఆంథ్రపాలజీ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాస్ స్కూల్‌లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అసోసియేట్ అయిన ఎమిలీ బ్రే.. పప్సీస్ మనుషుల మాటలను అర్థం చేసుకుని, కమ్యూనికేట్ చేసే నైపుణ్యాలతో పుడతాయని కన్‌ఫర్మ్ చేశారు. కుక్కపిల్లలు వ్యక్తుల ఐ కాంటాక్ట్‌ను ఫాలో అవుతాయని.. చుట్టూఉన్న పరిస్థితులు, సందర్భానికి అనుగుణంగా వారు ఇచ్చిన సమాచారాన్ని చిన్న వయస్సు నుండే అంటే మనుషులతో ఎక్కువగా మెలిగిన అనుభవం లేకముందే క్యాచ్ చేసే లక్షణాలను కలిగి ఉంటాయని తెలిపారు. ఈ మేరకు పప్పీస్, హ్యూమన్స్ మధ్య ఇంటరాక్షన్స్‌కు సంబంధించి పలు పరీక్షలు నిర్వహించారు. 98 లాబ్రాడర్ రిట్రీవర్స్, 23 గోల్డెన్ రిట్రీవర్స్‌తో పాటు 254 లాబ్రాడర్ గోల్డెన్ క్రాసెస్‌కు చెందిన మొత్తం 375 కుక్కలపై ఈ స్టడీ చేపట్టారు. ఒక టెస్టులో భాగంగా రెండు కప్పుల మధ్య దాచిపెట్టిన మరో కప్పును రీసెర్చర్ సూచనల ఆధారంగా కనిపెట్టిన పప్పీస్.. కేవలం స్మెల్ మీద ఆధారపడకుండా వస్తువులను గుర్తించడంలోనూ సక్సెస్ అయ్యాయి. మరో టాస్క్‌లో పప్పీలతో బిగ్గరగా మాట్లాడటం(డాగ్ డైరెక్ట్ స్పీచ్) మొదలుపెట్టిన రీసెర్చర్స్, అవి ఎంతసేపు మనుషులను చూస్తాయో గమనించారు.
దాదాపు అన్ని కుక్కలు కూడా ఒక్కో టెస్టులో సక్సెస్ కావడాన్ని పరిశీలిస్తే ఎర్లీ ఏజ్‌లోనే తమ స్కిల్స్ ప్రదర్శిస్తున్నట్టు అర్థమైంది. ఇక కంట్రోల్ టెస్టులో ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వనపుడు పప్పీలు మనుషుల సలహాలు, సూచనల కోసం ఎదురుచూడలేదు. అంటే మనుషులు కమ్యూనికేట్ చేసిన విషయానికి ఎలా స్పందించాలో వాటికి పుట్టినప్పటి నుంచే అలవడుతుందని, స్వంతంగా ఆలోచించి అమలు చేసే సామర్థ్యం పెంపొందేందుకు సమయం పడుతుందని స్పష్టమైంది. ఈ పరిశీలనలన్నీ హ్యూమన్స్‌తో కమ్యూనికేషన్‌కు కుక్కలు జన్యుపరంగా సిద్ధంగా ఉంటాయని వెల్లడిస్తున్నాయి.