పంజాబ్ క్యాబినెట్ మినిస్టర్‌కు కరోనా
ఛండీగడ్: పంజాబ్ క్యాబినెట్ మినిస్టర్ గురుప్రీత్ సింగ్ కంగార్‌కు ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, భిండా జిల్లాని స్వగ్రామం కంగార్‌లో ఐసొలేషన్‌లోకి వెళ్లినట్టు మంత్రి వెల్లడించారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గురుప్రీత్ సింగ్ కంగార్ శనివారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా మాన్సాలో త్రివర్ణ పతాకావిష్కరణతోపాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. దీంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, శ్రేయోభిలాషులు, ఇతర నేతలు ఆందోళన […]
ఛండీగడ్: పంజాబ్ క్యాబినెట్ మినిస్టర్ గురుప్రీత్ సింగ్ కంగార్‌కు ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, భిండా జిల్లాని స్వగ్రామం కంగార్‌లో ఐసొలేషన్‌లోకి వెళ్లినట్టు మంత్రి వెల్లడించారు. తనతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గురుప్రీత్ సింగ్ కంగార్ శనివారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా మాన్సాలో త్రివర్ణ పతాకావిష్కరణతోపాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. దీంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, శ్రేయోభిలాషులు, ఇతర నేతలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి కోడలుతోపాటు దగ్గరి బంధువు నరేందర్ సింగ్‌లకూ కరోనా పాజిటివ్ తేలింది. పంజాబ్‌లో ఇదివరకు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మినిస్టర్ త్రిప్త్ రాజేందర్ సింగ్ బజ్వాకూ కరోనా పాజిటివ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.