BJP MP: అదానీకి మద్దతు పలికిన బీజేపీ ఎంపీ.. కాంగ్రెస్‌పై సీరియస్
రాజకీయం కోసమే అదానీ(Adani) వ్యవహారాన్ని కాంగ్రెస్(Congress) రాద్ధాంతం చేస్తోందని బీజేపీ(BJP) ఎంపీ మహేష్ జెఠ్మలానీ(Mahesh Jethmalani) మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయం కోసమే అదానీ(Adani) వ్యవహారాన్ని కాంగ్రెస్(Congress) రాద్ధాంతం చేస్తోందని బీజేపీ(BJP) ఎంపీ మహేష్ జెఠ్మలానీ(Mahesh Jethmalani) మండిపడ్డారు. బుధవారం పార్లమెంట్(Parliament) ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా కోర్టులో వచ్చిన ఆరోపణలను గుడ్డి అనుసరించడం సరికాదని అన్నారు. భారత గ్రోత్ స్టోరీని అడ్డుకునే కుట్రతోనే అమెరికా(America) ఆరోపణలు చేస్తోందని చెప్పారు. భారత శత్రుదేశాలతో కూడా పోటీ పడి అదానీ గ్రూపు కాంట్రాక్టులు పొందిందని అన్నారు. ఇలాంటి ఆరోపణలు భారత ప్రయోజనాలకు విరుద్ధమని ప్రకటించారు. విద్యుత్ కాంట్రాక్టుల కోసమే కొన్ని సంస్థలకు, కొందరు అధికారులకు అదానీ లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అమెరికా ఛార్జిషీట్‌లో పేరు లేదు. వివరణ లేదని అన్నారు. ఎవరు లంచం ఇచ్చారో, ఎలా లంచం ఇచ్చారో కూడా పేర్కొనలేదని చెప్పారు.