Rahul Gandhi: అదానీని అరెస్ట్ చేయాల్సిందే.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

సోలార్ పవర్ కాంట్రాక్టుల (Solar Power Contracts) కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల (Bureaucrats)కు అదానీ గ్రూప్ (Adani Group) రూ.2,200 కోట్ల ముడుపులు ఇచ్చారనే అభియోగాలు దేశంలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి.

Update: 2024-11-27 06:21 GMT
Rahul Gandhi: అదానీని అరెస్ట్ చేయాల్సిందే.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సోలార్ పవర్ కాంట్రాక్టుల (Solar Power Contracts) కోసం భారత్‌లోని వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల (Bureaucrats)కు అదానీ గ్రూప్ (Adani Group) రూ.2,200 కోట్ల ముడుపులు ఇచ్చారనే అభియోగాలు దేశంలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. తాజాగా, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్‌ అదానీ (Gautam Adani), ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌ అదానీ (Sagar Adani)లకు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (US SEC) నోటీసులు జారీ చేసింది. తాజాగా, ఇదే వ్యవహారంపై లోక్‌సభ పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీ (Gautam Adani)ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆయనను కాపాడుతున్నారని కామెంట్ చేశారు. చిన్న చిన్న ఆరోపణలపై వందల మందిని అరెస్ట్ చేస్తున్నారని.. ఈ విషయంలో కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. అభియోగాలను అదానీ అంగీకరిస్తారని ప్రభుత్వం అనుకుంటుందా..? అని ప్రశ్నించారు. లంచాల ఆరోపణలను అదానీ ముమ్మాటికీ ఒప్పుకోరని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.  

Tags:    

Similar News