వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల రాస్తారోకో.. ప్రభుత్వానికి హెచ్చరిక
దిశ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లబెల్లి నేషనల్ హైవేపై బుధవారం రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ… రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. రైతు పండించిన […]
దిశ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లబెల్లి నేషనల్ హైవేపై బుధవారం రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ… రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చి రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి చర్యలు చేపట్టాలని, లేనియెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, మలోత్ చరణ్ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చర్ల శివారెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఏడాకుల సంపత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుషోత్తం సురేష్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు జ్యోతి, ఇస్తారు శేఖర్, జెట్టి రామ్మూర్తి, రాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.