‘గులాబ్’ ఎఫెక్ట్.. పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు మరోసారి జలకళను సంతరించుకున్నాయి. ‘గులాబ్’ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు 55,126 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 18 గేట్లు ఎత్తి 1,02,904 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాంకు 89,635 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, […]

Update: 2021-09-27 22:45 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు మరోసారి జలకళను సంతరించుకున్నాయి. ‘గులాబ్’ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు 55,126 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 18 గేట్లు ఎత్తి 1,02,904 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాంకు 89,635 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 18 గేట్లు ఎత్తి దిగువకు 1,39,091 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సమీపంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 4,32,163 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 40 గేట్లు ఎత్తిన దిగువకు 3,90,080 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Tags:    

Similar News