యావత్‌దేశం మీతోనే ఉంది : మోడీ

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో సంభవించిన వరదల వలన దౌలిగంగా రివర్ ఉధృతంగా ప్రవహించి డ్యామ్ ఆనకట్ట కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సమీప విద్యుత్ ప్లాంట్‌లో పనిచేస్తున్న సుమారు 150 మంది మంది కార్మికులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. దీనిపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. దురదృష్టవశాత్తు సంభవించిన ఈ విపత్తు పరిస్థితులను కేంద్రం నిషితంగా పరిశీలిస్తోందన్నారు. యావత్భారతం ఉత్తరాఖండ్ వెంటే ఉందని, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని దేశం […]

Update: 2021-02-07 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో సంభవించిన వరదల వలన దౌలిగంగా రివర్ ఉధృతంగా ప్రవహించి డ్యామ్ ఆనకట్ట కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సమీప విద్యుత్ ప్లాంట్‌లో పనిచేస్తున్న సుమారు 150 మంది మంది కార్మికులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. దీనిపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. దురదృష్టవశాత్తు సంభవించిన ఈ విపత్తు పరిస్థితులను కేంద్రం నిషితంగా పరిశీలిస్తోందన్నారు.

యావత్భారతం ఉత్తరాఖండ్ వెంటే ఉందని, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని దేశం కోరుకుంటోందని వివరించారు. అంతేకాకుండా, ప్రమాదం సంభవించిన చోట NDRF బృందాల మోహరింపుతో పాటు విస్తరణ, సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. ఇదిలాఉండగా, ప్రవాహంలో కొట్టుపోయిన కార్మికుల్లో 10మంది మృతదేహాలు లభ్యమైనట్లు రక్షణ సిబ్బంది పేర్కొన్నారు.

Tags:    

Similar News