త్వరలో రూ.483 కోట్లతో ప్రీమియర్ ఎనర్జీ కొత్త ప్లాంట్
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని ప్రముఖ సోలార్ పీవీ సెల్స్ అండ్ మాడ్యూల్స్ తయారీ సంస్థల్లో ఒకటైన ప్రీమియర్ ఎనర్జీస్ హైద్‌రాబాద్‌లో ఉన్న ఈ-సిటీలో తన నూతన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మితమయ్యే ఈ ఉత్పత్తి కేంద్రం 25 ఎకరాలలో విస్తరించి ఉంటుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రీమియర్ ఎనర్జీస్ ఇప్పుడున్న సామర్థ్యం కంటే మూడు రెట్లు అధికంగా ఉంటుందని, ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని ప్రముఖ సోలార్ పీవీ సెల్స్ అండ్ మాడ్యూల్స్ తయారీ సంస్థల్లో ఒకటైన ప్రీమియర్ ఎనర్జీస్ హైద్‌రాబాద్‌లో ఉన్న ఈ-సిటీలో తన నూతన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మితమయ్యే ఈ ఉత్పత్తి కేంద్రం 25 ఎకరాలలో విస్తరించి ఉంటుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రీమియర్ ఎనర్జీస్ ఇప్పుడున్న సామర్థ్యం కంటే మూడు రెట్లు అధికంగా ఉంటుందని, ఈ ప్లాంట్ కోసం రూ. 483 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ప్రీమియర్ ఎనర్జీ 500 మెగవాటా సామర్థ్యాన్ని కలిగి ఉంది, కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని 1.5 గిగావాట్లతో సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు సంస్థ వివరించింది. రానున్న 2 నెలల్లో ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది.
‘భారత్‌లో విద్యుత్ పరిశ్రమ భవిష్యత్తు పునరుత్పాదక శక్తిదేనని, ముఖ్యంగా సౌరశక్తి విభాగం ఈ రంగంలో ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. రానున్న రెండు నెలల్లోగా విస్తరించనున్న సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులను అందిస్తుందని, తద్వారా ఆసియా, యూరప్, అమెరికాలోని పలు ప్రముఖ తయారీ సంస్థలతో సమానంగా ఉండగలదని’ ప్రీమియర్ ఎనర్జీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలుజా వెల్లడించారు. కాగా, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుగా ఉన్న ఈ సంస్థ తెలంగాణలోని సికింద్రబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 250 మెగావాట్ల కంటే ఎక్కువ సౌర విద్యుత్ ప్లాంట్‌లను నిర్వహిస్తోంది. అధిక నాణ్యత, విశ్వసనీయమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి పెట్టడం ద్వారా 2028 నాటికి సౌర తయారీలో పరిశ్రమలోని టాప్ 5 సంస్థలలో ఒకటిగా ఉంది.