Honda SP 160: హోండా నుంచి మరో కొత్త బైక్ మార్కెట్లో విడుదల.. ధర రూ. 1.21 లక్షలు..!

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా(Honda) ఇటీవలే అప్డేటెడ్ ఎస్‌పీ125(Honda SP125) వెర్షన్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-12-24 16:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా(Honda) ఇటీవలే అప్డేటెడ్ ఎస్‌పీ125(Honda SP125) వెర్షన్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా మరోకొత్త బైకును తీసుకొచ్చింది. హోండా SP 160(Honda SP 160) పేరుతో దీన్ని దేశీయ మార్కెట్ లో ఆవిష్కరించింది. సింగిల్ డిస్క్(Single Disk), డ్యూయల్ డిస్క్(Dual Disk) ఆప్షన్లతో దీన్ని తీసుకొచ్చారు. ఈ బైకు ధరను రూ. 1,21,951(Ex-Showroom)గా నిర్ణయించింది. టాప్ మోడల్ ధరను రూ. 1.27 లక్షలుగా డిసైడ్ చేసింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. దీన్ని 162.71సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ తో తీసుకొచ్చారు. ఇది 13.7 bhp పవర్, 14.8 Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ సెటప్‌తో వస్తుంది. LED హెడ్‌ల్యాంప్ , టెయిల్‌ల్యాంప్‌ కలిగి ఉంది. ఇక ఎస్‌పీ125 బైక్ తరహాలోనే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే, నావిగేషన్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌, మ్యూజిక్ ప్లే బ్యాక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ రేడియంట్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, అథ్లెటిక్ మెటాలిక్ అనే నాలుగు కలర్స్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Also Read...

BIG Alert: ఇంటర్నేషనల్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండండి.. టెలికాం యూజర్లకు కేంద్రం హెచ్చరిక..! 

Tags:    

Similar News